![]() |
![]() |

ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ రీసెంట్ గా హీరోయిన్ ల వస్త్రాల గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు శివాజీ కామెంట్స్ మీద చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయ్యారు. ఆమె ఒక పోస్ట్ పెట్టారు. "తెలుగు నటుడు శివాజీ 'దరిద్రపు ముండా' వంటి పదాలను ఉపయోగిస్తూ హీరోయిన్ లు తమ సామానులు కవర్ చేసుకోవడానికి చీరలు ధరించాలి అంటూ అనవసరమైన సలహా ఇవ్వడం ఏమిటి.
నటుడు శివాజీ ఒక అద్భుతమైన చిత్రంలో విలన్గా నటించాడు మరియు చివరికి హీరోగా మారాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇవన్నీ ప్రొఫెషనల్ ప్రదేశాలు..అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. ఆయన జీన్స్, హూడీలు వేసుకోకుండా ధోతీలు మాత్రమే కట్టుకుని భారతీయ సంస్కృతిని అనుసరించాలి కదా. బొట్టు పెట్టుకోవాలి అలాగే అతనికి వివాహం అయ్యుంటే పెళ్లి ఐనందుకు గుర్తుగా కంకణం, కాలికి మెట్టెలు ధరించాలి కదా. ఇక్కడ మహిళల్ని ఎంతో ఘోరంగా చూస్తున్నారో" అంటూ ఆమె పెట్టిన ఒక వ్యంగ్యాత్మక ఘాటైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
https://twitter.com/Chinmayi/status/2003308949257470105
![]() |
![]() |